సంగీత, సాహిత్యాలు దేనికదే చాలా లోతైన విషయా లు. జీవితకాలపు కృషి ద్వారా సంపూర్ణంగా ఒకదాన్ని అందుకోవటమే కష్టం. సామల సదాశివ ఈ రెంటిలోనూ సమానమైన సాధికారతను సంపాదించటం తెలుగు వాళ్లమని చెప్పుకుంటున్న వాళ్లందరూ గర్వపడాల్సిన విష యం.‘సంగీత, సాహిత్యాలను రెండు కళ్లతో పోలుస్తూ-సదాశివ మూడో నేత్రం అనువాదరంగం’అంటారు. నిజానికి సదాశివ మూడో నేత్రం చిత్ర కళారంగం. సదాశివ చిత్రకారుడన్న సంగతి చాలా మందికి తెలియదు. తన కృషి గురిం చి తాను ఏసందర్భంలోనూ,ఏ మాత్రమూ చెప్పుకోని నిం డుకుండ ఆయన. అందుకే అతనిలో బయటపడని కళలు ఇంకా ఎన్నిదాగిపోయి ఉన్నాయో? అని అప్పుడప్పుడు ఆశ్చర్యమూ, అనుమానమూ కలుగుతుండేవి.
ఏకకాలం లో తెలుగు,హిందీ,ఉర్దూ, పార్శీ,మరాఠీ భాషలలోని సాహి త్య చరివూతలను అర్థం చేసుకొని,తులనాత్మకంగా వివేచించ టం బహుశా సదాశివ ఒక్కరికే సాధ్యమయిందేమో? తాను నేర్చుకున్న దాన్ని పదిమందికి పంచాలనే జ్ఞానదాన దృష్టి సదాశివకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించి పెట్టింది .
ఇంతకు ముందే చెప్పినట్లు మన వాళ్లకు తెలియని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతోనే ఉర్దూ, పార్శీ సాహిత్యాల గురించి రాశానంటారు సదాశివ. ఆయన కృషి ని పోయెట్రీ నుంచి ప్రోజ్ వైపు మళ్లించినది సురవరం ప్రతాపరెడ్డి. తన యాదిలో, ఇతర ఇంటర్వ్యూలలో సురవరం గారికి వినయం గా కృతజ్ఙతలు తెలుపుకున్నారు. సదాశివకు ఉర్దూ తో గల అనుబం ధం ప్రత్యేకమైనది.తన చదువంతా ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగడం వల్ల-తన వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఆ భాషలో నిష్ణాతుడై అనేక వందల వ్యా సాలు రాసి-ఉర్దూ సాహిత్య చరివూతలో చెరిగిపోని సంతకం చేసిన సదాశివ తెలుగువాడం ఉర్దూ పాఠకులు ఆశ్చర్యపోయేవారు.‘ఉర్దూ సాహిత్య చరివూత’ను, ‘ఉర్దూ కవుల కవితా సామక్షిగి’ని,‘అమ్జద్ రుబాయి’లను,‘ఫారసీ కవుల ప్రసక్తి’ని‘ఉర్దూ కవితా సౌందర్యాన్ని తెలుగు పాఠకులకు అడుగని కానుకలుగా అందించిన సదాశివ ఉర్దూ-తెలుగు భాషలకు మధ్య వారధిని నిర్మించారు.
ముచ్చట్లు తెలంగాణ ప్రజా జీవితానికి సంబంధించిన మౌఖిక సాహిత్య రూపం.అలాంటి ముచ్చట్లకు జాతీయ స్థాయి ఖ్యాతిని తీసుకొచ్చిన తెలంగాణ వైతాళికుడు సదాశివ.యాదిలో ఆయన రాసిన ముచ్చట్లను చదివితే-సాహిత్యానికీ, జీవితానికీ సంబంధించి మనకింత వరకు అనుభవంలోకి రాని ఎన్నో కొత్త విషయాలు లభిస్తాయి. ఇంతటి జ్ఞానాన్ని సంపాదించటానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడో, ఎంత కాలాన్ని ధార పోశాడో? ఆ సారమంతా మన కు యాదిలో దొరుకుతుంది.ఆయన రాసిన ‘స్వరలయలు’ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. అప్పు డు ‘స్వరలయలు’ పుస్తకం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినది మాత్రమే.
ఆ పుస్తకంలో అంతా సం గీతం గురించే ఉంటుంది.‘యాది’లో నా వ్యక్తిత్వముంది-ఇదే పురస్కారం యాదికి వస్తే మరింత సంతోషపడేవాణ్ణి’ అన్నారు సదాశివ. నిజంగా జీవిత చరివూతల్లో, నవలల్లో, కథ ల్లో, కవిత్వంలో దొరకని అనేక అంశాలు ఆత్మకథ’ ల్లో దొరుకుతాయి. ఆత్మకథ లాంటి ఈ యాదిలో రెండు మూడు తరాల సాహితీమూర్తుల వ్యక్తిత్వం దొరుకుతుంది. ఇంతటి ప్రతిభాశాలికి తన 83వ ఏట కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటి? అందుకే కొత్తపల్లి జయశంకర్ -‘ఇంతటి మహోన్నత వ్యక్తికి ఈ సువిశాల ఆంధ్రవూపదేశ్‌లో లభించవలసిన గుర్తింపు లభించిందా?’అన్న ప్రశ్నను సంధించారు. తాను తెలంగా ణ వాడినైనందుకు ఎలా అవమానాలు పొందినాడో సదాశివ స్వయంగా చాలాచోట్ల చెప్పుకున్నాడు. సంగీత-సాహిత్యాలకూ, తెలుగుకు-ఉర్దూకూ మధ్య వారధిలా పని చేసిన సదాశివ భౌతికంగా నేడు మన కళ్లముందు లేకున్నా ఆయన సృష్టించిన అపూర్వమైన సాహిత్య సంపద ఉన్నది. అందులోకి వెళ్లి మన పాత తరాల జీవితాల్లోని అమూల్యమైన మేథో సంపదను అందుకోవటమే మనముందున్న కర్తవ్యం. అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
-తోకల రాజేశం
తెలంగాణ రచయితల వేదిక ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి
(నేడు సదాశివ 85వ జయంతి)

No comments:
Post a Comment